పర్చూరు పరిసర ప్రాంతాలను మంగళవారం మంచు దుప్పటి కమ్మేసింది. ఉదయం ఎనిమిది గంటలు దాటినా మంచు వదలక పోవడంతో వాహన దారులు లైట్ల వెలుతురులో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ పనులకు వెళ్ళే రైతులు, దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణీకులు కూడ తమ ప్రయాణాలు కొంత సమయం వాయిదా వేసుకున్నారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న జాతీయ రహదారి పనులు సైతం నెమ్మదించాయి.