పర్చూరులో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు పెరిగింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే అక్కా చెల్లెలు మృతి చెందగా వారి తల్లి లక్ష్మీరాజ్యం తీవ్రంగా గాయపడటం తెలిసిందే. ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది. ఈ మేరకు పర్చూరు పోలీసులకు సమాచారం అందగా వారు తదుపరి చర్యలు చేపట్టారు. లక్ష్మీరాజ్యం మృతి విషాదం నింపింది.