అమరావతి మండలం పంచరామ క్షేత్రమైన శ్రీ బాల చాముండిక అమరలింగేశ్వరస్వామి ఆలయాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు కలెక్టర్ అరుణ్ కుమార్ బోకే అందించారు. అమరలింగేశ్వరస్వామి ఆలయ ఈవో సునీల్ కుమార్ మాజీ రాష్ట్రపతికి స్వాగతం పలికారు. వాయిద్యాలు మేళతాళాలతో ఆలయంలోకి ఆహ్వానించి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.