పడవపై ప్రయాణించిన ఎమ్మెల్యే భాష్యం

72చూసినవారు
కృష్ణ నదీ పరివాహక ప్రాంతమైన అమరావతిలో కృష్ణానది పొంగి పలు కాలనీలు ముంపుకు గురయ్యాయి. ముత్యాలమ్మ కాలనీ ముస్లిం ఏరియాలలో నడుముల లోతు 5 అడుగుల నీరు ప్రవహిస్తుండడంతో సోమవారం ఎమ్మెల్యే పడవపై ప్రయాణించారు. ముంపులో చిక్కుకున్న నివాసాల వద్దకు వెళ్లి అక్కడి ప్రజలను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట నిత్యావసర సరకులు అన్నం ప్యాకెట్లు అందించాలని తమ సిబ్బందికి, నాయకులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్