ఉంగుటూరులో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

85చూసినవారు
ఉంగుటూరులో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
అమరావతి మండలం ఉంగుటూరు గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉంగుటూరు, పెదకూరపాడు, అబ్బ రాజుపాలెం గ్రామాలలో వినాయకుని ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అత్తిమల రమేష్, భాష్యం ఆంజనేయులు, గల్లా బాబురావు, ఇంకా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్