పెదకూరపాడు మండల విద్యాశాఖ కార్యాలయంలో ఓపెన్ స్కూల్ పోస్టర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ కోఆర్డినేటర్ షేక్ అక్బర్ వలి బుధవారం ఆవిష్కరించారు. 10, ఇంటర్ తరగతుల అడ్మిషన్లు కూడా ప్రారంభించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు మండల విద్యాశాఖ అధికారి 2 తాడిశెట్టి సత్యనారాయణ, మండల విద్యాశాఖ సిబ్బంది, పాల్గొన్నారు.