పెదకూరపాడు మండల పరిధిలోని 75 తాళ్లూరు గ్రామంలో మంగళవారం పశు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పశుగణాభివృద్ధి చేయడంలో భాగంగా గ్రామాలలో పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీదేవి అన్నారు. 75 తాళ్లూరు గ్రామంలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. వైద్య శిబిరంలో అనేక పశువులు వాటి రోగ పరిస్థితిని పరిశీలించారు. 21 నుంచి 30వ తేదీ వరకు గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తారని తెలిపారు.