జగనన్న కాలనీలలోని లబ్ధిదారులకు రూ 5 లక్షలు అందించాలి

822చూసినవారు
జగనన్న కాలనీలలోని లబ్ధిదారులకు రూ 5 లక్షలు అందించాలి
పొన్నూరు పట్టణంలో నిర్మాణంలో ఉన్న జగన్నన కాలనీలోని లబ్ది దారులకు రూ. 5లక్షలు ఇచ్చి గృహ నిర్మాణానికి తోడ్పడవలసినదిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజా నాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరే టి రామారావు. డిమాండ్ చేశారు. జగనన్న కాలనీలో నిర్మిస్తున్న భవనాలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం సరిపోవటం లేదని, ఒక్కొక్క గృహ నిర్మాణా నికి ఐదు లక్షలు ఇచ్చి తోడ్పాటు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈవిషయమై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీన పొన్నూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. లబ్ధిదారులకు కరపత్రాలను పంచి సిపిఐ ఆధ్వర్యంలో జరిగే ధర్నా ను లబ్ధిదారులు విరివిగా పాల్గొని జయప్రదంచేయలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్