8న చంద్రబాబు బహిరంగ సభను జయప్రదం చేయండి

2203చూసినవారు
8న చంద్రబాబు బహిరంగ సభను జయప్రదం చేయండి
ఈనెల 8వ తారీఖున తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొన్నూరు పర్యటన లో భాగంగా రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమంలో పాల్గొంటారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడున్నర ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో విఫలమైందని పేర్కొన్నారు. రాష్ట్రానికి రావలసిన అమర రాజా బ్యాటరీ స్ పరిశ్రమ తెలంగాణ తరలిపోయిందని దీనికి కారణం వైకాపా ప్రభుత్వమేనని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఒకపక్క ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకునే నాధుడే లేడన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలన వైఫల్యాలను ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ వినూత్న కార్యక్రమమే రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమని ఈ కార్యక్రమాన్ని ప్రజలతో పాటు ఉద్యోగ సంఘాలు, రైతులు, విద్యార్థులు, కార్మికులు , కర్షకులు మద్దతు తెలపాలని కోరారు. సమావేశంలో మండల , పట్టణ తెదేపా నాయకులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రానికి ఇదేం కర్మ మినీ పాంప్లెట్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్