రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు జగనన్న కాలనీ నిర్మాణాలను శనివారం పొన్నూరు మండలం ఎంపీడీవో భవనం మారుతి శేషమాంబ, హౌసింగ్ అధికారులు డిఈ. కోటేశ్వరరావు, ఏఈ. రెడ్డి, సచివాలయ సిబ్బందితో క్షేత్రస్థాయిలో సందర్శించారు. నండూరు, చిన్న ఇటికంపాడు గ్రామాలలో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీలను పరిశీలించి లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. కాలనీలో మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందని త్వరలో అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేస్తామని ఎంపీడీవో శేషమాంబ తెలిపారు. సచివాలయ సిబ్బంది అధికారులు సమన్వయంతో నూరు శాతం జగనన్న కాలనీ నిర్మాణం జరిగేటట్లు చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.