చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

2481చూసినవారు
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు గుంటూరు కు చెందిన తోట నరేంద్ర గత నెల 29వ తేదీన నిజాంపట్నం వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్న సమయంలో మండల పరిధిలోని మామిడిపల్లి అడ్డరోడ్డు వద్ద బైకు అదుపుతప్పి పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. నరేంద్రాను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ నరేంద్ర శుక్రవారం మృతి చెందాడు మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భార్గవ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్