పొన్నూరు: కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి

72చూసినవారు
కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. గురువారం పొన్నూరు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 6నెలల కూటమి పాలనలో ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ భారం మోపిందని పేర్కొన్నారు. అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రేపు ఆందోళన చేపట్టి విద్యుత్ అధికారులకు మెమోరాండం ఇస్తున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్