ప్రజా నాయకుడు ఎదురులేని మనిషి ఆఖరి నిమిషం వరకు ప్రజా సమస్యలపై పోరాడినా జననేత స్వర్గీయ వంగవీటి మోహన రంగా ఆదర్శనీయుడని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం విఎం రంగా 36వ వర్ధంతిని పుష్కరించుకొని పొన్నూరు పట్టణంలోని రామ మందిరం దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ, మండల జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.