ప్రజారోగ్యం దృష్ట్యా గత ప్రభుత్వం లక్షలాది రూపాయలు ప్రజాధనం వెచ్చించి పొన్నూరు మున్సిపాలిటీకి 6ఈ ఆటోలు అందజేసింది. అప్పటినుంచి ఆటోవాహనాలను అధికారులు చిన్నచిన్న సాంకేతిక కారణాలు చూపించి మూలాన పడేశారు. చెత్త వ్యర్ధాలను తరలించే కంపాక్టర్ ను కూడా షెడ్డులో పడేశారు. దీంతో పట్టణంలో చెత్త వ్యర్ధాలు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. అధికారులు నిర్లక్ష్యంవీడి వాహనాలను వాడుకలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.