గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గoనియోజకవర్గం కాకుమాను గ్రామంలో బుధవారం తెల్లవారుజామున కొల్లా శ్రీనివాసరావుకు చెందిన పశువుల పాక ఒక గేదె, దూడ అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మంటలను అదుపు చేసేలోపు గేదె, దూడ మంటలలో కాలిపోయాయి. ఆస్తి నష్టం అంచనా తెలియాల్సి ఉంది. కాకుమాను పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.