రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ సదస్సులను ప్రజలు వినియోగించుకోవాలని కాకుమాను తహసిల్దార్ వెంకట స్వామి అన్నారు. బుధవారం కాకుమాను మండలం తేలగాయ పాలెం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రెవెన్యూ సదస్సులో 17 అర్జీలు అందినట్లు తహసిల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, రిజిస్ట్రేషన్, ఎండోమెంట్ అధికారులు పాల్గొన్నారు.