చెరుకుపల్లి ఆరుంబాక గ్రామాల పరిధిలో 216 ఏ జాతీయ రహదారి ప్రక్కన మురుగునీటి కాలువపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణాన్ని డిఈ వీరయ్య, జేఈ కళ్యాణ్ శుక్రవారం పరిశీలించారు. కాలువపై నిర్మాణానికి సంబంధించి అనుమతులు ఉన్నాయా లేవా అని పరిశీలించి, వారం రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నిర్మాణం కారణంగా తమ గ్రామాల పరిధిలో 1500 ఎకరాల్లో పంట పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.