డిజిటల్ లైబ్రరీ పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని నగరం శాఖా గ్రంధాలయ అధికారి కోటేశ్వరరావు అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.