ఫిరంగపురం మండలం మేరికపూడి మార్గంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆర్టీసీ బస్సు, కారు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో నరసరావుపేటకు చెందిన అడ్డగిరి రమేశ్ కు గాయాలయ్యాయి. దీంతో అతడిని చికిత్స నిమిత్తం వెంటనే నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.