చెరుకుపల్లిలో దంచికొట్టిన వర్షం

560చూసినవారు
చెరుకుపల్లిలో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. వర్షం కురవడంతో చిరు వ్యాపారస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా ఎండాకాలాన్ని తలపించడంతో ప్రజలు కొంత అసౌకర్యానికి లోనయ్యారు. అయితే వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి కొన్ని ప్రాంతాలలో వర్షపు నీరు రహదారిపై నిలిచింది.

సంబంధిత పోస్ట్