ఎండాకాలంలో ప్లాస్టిక్ లోని విష పదార్థాలు కరిగి, క్యాన్సర్ కు ఎక్కువగా దోహదపడతాయని కమీషనర్ సాంబశివరావు తెలియచేశారు. ప్లాస్టిక్ నిరోధం గురించి స్ట్రీట్ వెండర్స్ తో రేపల్లె ప్రధాన కూరగాయల మార్కెట్ వద్ద గురువారం అవగాహన కల్పించారు. 2050 నాటికి జీవన మనుగడకు ప్రశ్నార్థకంగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని కోరారు. ఇళ్ల నుండి తడి, పొడి చెత్తను వేరు చేసి కార్మికులకు ఇవ్వాలని సూచించారు.