పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్

76చూసినవారు
పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్
పేకాట స్థావరంపై రేపల్లె పట్టణ పోలీసులు గురువారం దాడులు నిర్వహించారు. రేపల్లె పట్టణంలో పేకాడుతున్నారన్న సమాచారంతో పట్టణ సీఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేసి పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 2800 స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని సిఐ తెలిపారు. పట్టణ పరిధిలో పేకాట, కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్