పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని బెల్లంకొండ పోలీసులను సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు సూచించారు. బెల్లంకొండ పోలీస్ స్టేషన్ ను శనివారం డిఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్లోని కేసుల రికార్డులను పరిశీలించి, పలు సూచనలు చేశారు. స్టేషన్ కి వచ్చే ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించే విధంగా కృషి చేయాలని సూచనలు చేశారు.