రైల్వేశాఖ సత్తెనపల్లి సెక్షన్లో పర్మినెంట్ వే(పి-వే) విభాగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని దక్షిణమధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ డివిజనల్ కార్యదర్శి రమణయ్య కోరాడు. సత్తెనపల్లి కార్యాలయంలో ఇన్చార్జి పి-వే ఇన్స్పెక్టరు శ్రీనివా సరావును సోమవారం సంఘ నాయకులతో కలిసి విన్నవించారు. కార్మికులకు సెలవులు మంజూరు, కీమెన్ల సమస్యలు తదితరాలను ప్రస్తావించారు.