డాక్టర్.బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా కంతేరు గ్రామంలో ఆదివారం బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు బిట్రా వెంకటశివన్నారాయణ, బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ, బీజేపీ మండల అధ్యక్షుడు సీహెచ్. సీతాదేవి, నాయకుడు బండ్లమూడి సాంబశివరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.