తాడికొండ మండల పరిధిలోని కంతేరు గ్రామంలో బుధవారం నాడు ఆకాల వర్షాలు వల్ల పంట నష్టపోయిన రైతులను గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సందర్శించి రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధికార ప్రతినిధి శిఖా శంకరరావు, మాజీ ఉప సర్పంచ్ జెట్టి బ్రహ్మనాయుడు, మల్లవరపు ఇమానేయులు, పాగోలు శ్రీనివాసరావు, బుల్లా విజయరావు, దారా సుందరరావు తదితరులు పాల్గొన్నారు.