తుళ్లూరు లైబ్రరీ సెంటర్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మంగళవారం రాత్రి అరగంటకు పైగా ట్రాఫిక్ ను పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. ఎక్కడి వాహనాలు అక్కడే స్తంభించుకోవడంతో పాటు బస్సులు కూడా ఇరుక్కుపోవడంతో చాలాసేపటి తర్వాత పోలీసులు ప్రయత్నించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ప్రధానంగా దుకాణాలన్నీ రోడ్డు మీద పెట్టడంతో రద్దీ పెరగటం వలనే ట్రాఫిక్ ఇబ్బంది వచ్చిందని పోలీసులు తెలిపారు.