గుంటూరు నగరంలోని పీకలవాగు నుంచి వెళ్లే ప్రధాన డ్రైన్ వేజెండ్ల, సుద్దపల్లి పంట పొలాల్లో చేరకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. వేజెండ్ల, సుద్దపల్లి గ్రామాల పరిధిలో పీకలవాగు, సంగం జాగర్లమూడి నుండి గుంటూరుకు త్రాగునీటిని సరఫరా చేసే పైప్ లైన్ ని మంగళవారం కమిషనర్ పరిశీలించారు. జీఎంసీ అధికారులు, సిబ్బంది కమిషనర్ పర్యటనలో పాల్గొన్నారు.