మానవుల రక్షణ కోసం యేసుక్రీస్తు మానవుడిగా జన్మించారని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. తెనాలి ఎన్జీవో కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగిన పాస్టర్ క్రిస్మస్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేకు ను కట్ చేసి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కత్తెర సురేశ్ పాల్గొన్నారు