మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు

61చూసినవారు
వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇంటి వద్ద బుధవారం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం కౌంటింగ్ అనంతరం బ్రహ్మనాయుడికి చెందిన కళ్యాణ మండపంపై కొందరు వ్యక్తులు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో కొత్తపేటలోని ఆయన నివాస గృహా సమీపంలోని అన్ని రహదారులపై భారీకేడ్లు ఏర్పాటు చేసి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్