అర్హులైన కుటుంబాల వారికి ఇంటి పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ శంకర నాయక్ తెలిపారు. సోమవారం ఆయన నూజెండ్ల మండలం కమ్మవారిపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఒంగోలు నుంచి పనుల నిమిత్తమై వలస వచ్చిన ఆరు యానాది కుటుంబాలకు సంబంధించి చర్చించటానికి వచ్చినట్లు చెప్పారు.