రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ లో పేదలకు అందుతున్న ఆహారం నాణ్యత, క్యాంటీన్ నిర్వహణను వినుకొండ మునిసిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆర్ ఓ వాటర్ ఏర్పాటు, టోకెన్ విధానం, టిఫిన్ నాణ్యతను పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు.