వినుకొండ పట్టణంలో ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ప్రభుత్వ వైద్యశాలలో ఉచితంగా అన్ని రకాల క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ అబ్దుల్ రజాక్ తెలిపారు. పట్టణం, నియోజకవర్గంలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. పరీక్షలు నిమిత్తం వచ్చిన ప్రజలకు సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.