AP: విశాఖ రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి జీవీఎంసీ సూచన చేసింది. రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారు పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని జీవీఎంసీ సూచించింది. ఈ మేరకు బాధితులు టీడీఆర్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని జీవీఎంసీ చీఫ్ సిటీప్లానర్ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ఆధార్, యూజర్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులు జీవీఎంసీలో ఇవ్వాలని వెల్లడించారు.