హీట్ వేవ్స్ ప్రభావంతో ఏపీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సగటున 40 డిగ్రీలకు చేరాయి. ప్రస్తుతం సాధారణం కంటే 4 డిగ్రీల వరకూ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. ఈ సమ్మర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 150కి పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు రికార్డు సృష్టించాయి. హీట్ వేవ్స్ కారణంగా చాలా చోట్ల వడగాల్పులు వీస్తున్నాయి.