భారతదేశంలో ఇప్పటివరకు నడిపిన అతి పొడవైన, అతి బరువైన గూడ్స్ రైలు 'సూపర్ వాసుకి'. ఇది 3.5 కి.మీ పొడవు, 295 వ్యాగన్లతో 25,962 టన్నుల బరువును మోస్తుంది. ఈ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి రాజనంద్‌గావ్ వరకు 267 కి.మీ దూరాన్ని 11 గంటల్లో చేరుతుంది. ఇందులో ఒక్కసారి తీసుకెళ్లే బొగ్గుతో 3,000 మెగావాట్ల సామర్థ్యం గల పవర్ ప్లాంటును ఒక రోజు పాటు నడపవచ్చు. ఇది విద్యుత్ రంగంలో కీలక పాత్ర పోషిస్తుంది.