ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తుపాన్ ఎఫెక్ట్ జిల్లాల్లో ఉన్న ఎపిడెమిక్ సెల్‌లు 24 గంటలు అందుబాటులో ఉంచడంతో పాటు నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించినట్లు సంచాలకులు డాక్టర్ కె. పద్మావతి తెలిపారు. రాష్ట్ర ఎపిడెమిక్ సెల్ నంబరు 9032384168తో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాలు సమన్వయం చేసుకుని పని చేయాలని ఆదేశించారు. ఇప్పటికే వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.