ఏపీలో కూటమి ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను నెరవేర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇల్లు లేని వారికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చేందుకు సిద్దమవుతోంది. అయితే స్థలాలు ఇస్తే ఇంటిని నిర్మించుకోలేని వారి పరిస్థితి ఏమిటనే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. కాగా ఇంటి స్థలం మంజూరుతో పాటు, స్వయంగా ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని మైదుకూరు పర్యటనలో సీఎం చంద్రబాబు చెప్పారు. ఇదే అమలులోకి వస్తే, పేదవారి సొంతింటి కల నెరవేరుతుందని ప్రజలు భావిస్తున్నారు.