విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. హాస్టల్ నిర్వాహకుడు అరెస్ట్ (వీడియో)

54చూసినవారు
అనకాపల్లి జిల్లా కైలాసట్నం అనాథ పాఠశాలలో నిన్న ముగ్గురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసులో భాగంగా ట్రస్ట్ నిర్వాహకుడు కిరణ్‌ను అరెస్ట్ చేశారు. అనాథాశ్రయం పేరుతో హాస్టల్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చిన్న రేకుల షెడ్డులో 86 మంది ఉంచారని, ఫంక్షన్లలో మిగిలిపోయిన సమోసాలు, బిర్యానీలు పరిశీలించకుండానే విద్యార్థులకు ఇచ్చినట్లు తెలిపారు. దాని వల్లే ఫుడ్ పాయిజన్ అయిందని వెల్లడించారు. ఈ మేరకు హాస్టల్‌ను సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్