ముంబైపై కోల్‌కతా ఘన విజయం

587చూసినవారు
ముంబైపై కోల్‌కతా ఘన విజయం
ఐపీఎల్‌-2024లో ముంబైకి వరుసగా నాలుగో ఓటమి. కోల్‌కతా 24 పరుగుల తేడాతో ముంబైపై విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ.. 18.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌట్‌ అయింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (56) అర్ధశతకంతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా తేలిపోయారు. కోల్‌కతా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 4, వరుణ్‌ 2, నరైన్‌ 2, రస్సెల్‌ 2 వికెట్లు తీశారు