సౌర విద్యుత్ ఒప్పందం కొనుగోళ్లలో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన, ప్రసారం చేసిన తప్పుడు, అసత్య కథనాలపై వైఎస్ జగన్ ఢిల్లీ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. వెంటనే ఆ కథనాలు, వీడియోలు తొలగించి, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీంతో కోర్టు ఆ సంస్థల ఎడిటర్లకు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.