AP: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో దారుణం జరిగింది. ఎర్రగుడిపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్‌పై కొడుకు ఉత్తయ్య కత్తితో దాడి చేశాడు. ఇంటి అమ్మకం విషయంలో తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంతో ఉత్తయ్య కత్తితో తండ్రిపై దాడి చేశాడు. గాయపడిన వెంకటేశ్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.