టీడీపీ నేత బుద్దా వెంకన్న వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘గతంలో చంద్రబాబు పుంగనూరు వస్తే ఆయనపై దాడులు చేయించారు. ప్రజల కోసం పని చేసే మా నాయకుడికి భయం లేదు. దోచుకున్న మీకు భయం. అందుకే పారిపోతున్నారు. మీరు గత ఐదేళ్లు నడిపింది రావణ కాష్టం. ఇది రామరాజ్యం. పిచ్చిపిచ్చిగా వాగితే నాలుక కోస్తాం.’ అని అన్నారు.