రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలను ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోన్నట్లు తెలిపింది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల వరకు స్థలాలను కేటాయించేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ మేరకు ఈ ప్రతిపాదనలకు వచ్చే కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.