పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు లక్షకు పైగా మెజారిటీ ఖాయం: హైపర్ ఆది

59చూసినవారు
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు లక్షకు పైగా మెజారిటీ ఖాయం: హైపర్ ఆది
జనసేన పార్టీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ హైపర్ ఆది ఈరోజు పిఠాపురం చేరుకున్నారు. షూటింగులన్నీ ముందే పూర్తి చేసుకుని వచ్చాం. ఇక ఎన్నికలు అయిపోయే వరకూ ఇక్కడే ఉండి జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసే 21 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని వెల్లడించారు. తాము ఏ ఇంటికి వెళ్లినా అపూర్వ స్పందన వస్తోందని, తాము అడగకముందే పవన్ కళ్యాణ్ కే ఓటేస్తామని స్వయంగా ప్రజలే చెబుతున్నారని వివరించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు లక్షకు పైగా మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్