మెటా సంస్థ మరో సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఏఐతో పనిచేసే 'మెటా ఏఐ' అనే ప్రత్యేక చాట్‌బోట్‌ను లాంచ్ చేసింది. ఈ ఏఐ చాట్‌బోట్‌తో యూజర్లు సరదాగా చాట్ చేయడం లేదా తమకు నచ్చిన ప్రశ్నలను అడగడం వంటివి చేయొచ్చు. Llama టెక్నాలజీ సాయంతో రూపొందిన ఈ మెటా ఏఐ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉండటంతో.. కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తోంది. మరి మీ వాట్సాప్‌లో ఈ ఫీచర్ వచ్చిందా?