వార్ 2 సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఎన్టీఆర్

57చూసినవారు
వార్ 2 సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారిగా బాలీవుడ్ లో నటిస్తున్న వార్ 2 చిత్రం షూటింగ్ కోసం ఆయన ముంబై చేరుకున్నారు. హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. వార్-2 చిత్రానికి బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకుడు. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ముంబైలో దిగిన ఎన్టీఆర్ కు సంబంధించిన న్యూ లుక్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్