భారత్‌ ఆలౌట్‌.. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభం

78చూసినవారు
భారత్‌ ఆలౌట్‌.. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభం
ఉప్పల్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. 421 వద్ద ఆట ప్రారంభించిన ఇండియా 15 పరుగులు చేసి 436 పరుగులకు పరిమితమైంది. దీంతో భారత్‌ 190 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో జడేజా 87, రాహుల్‌ 86, జైస్వాల్‌ 80, అక్షర్‌ 44, భరత్‌ 41 పరుగులతో రాణించారు. అనంతరం ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. క్రీజులోకి క్రాలీ, డకెట్‌ వచ్చారు.

సంబంధిత పోస్ట్