అమెరికాకు చంద్ర‌బాబు.. కార‌ణ‌మిదేనా..?

40502చూసినవారు
అమెరికాకు చంద్ర‌బాబు.. కార‌ణ‌మిదేనా..?
తెలుగుదేశం అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా చంద్రబాబు వెంట ఉన్నారు. లోకేశ్‌ కొద్దిరోజుల క్రితం కుటుంబంతో కలసి అమెరికా వెళ్లారు. చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన గతంలో కూడా ఒకసారి అమెరికాలో మెడికల్ టెస్టులు చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల కోసం వెళ్లారు. ఐదారు రోజుల్లో ఆయన తిరిగి రానున్నారు.

సంబంధిత పోస్ట్