AP: కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ‘జగన్.. వాస్తవ లెక్కలు చూస్తే మీ నిర్వాకం తెలుస్తుంది. మీ పాలనలో ఈ సమయానికి సేకరించిన ధాన్యం 4.43 మెట్రిక్ టన్నులు. కూటమి ప్రభుత్వం సేకరించిన ధాన్యం 9.14 మెట్రిక్ టన్నులు. ధాన్యం సేకరించిన 24 గంటల్లో రైతు ఖాతాలోకి డబ్బులు వేస్తున్నాం. రైతులకు అండగా నిలుస్తుంది కూటమి ప్రభుత్వమే.’ అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.